శబరిమల యాత్రపై నిఫా ప్రభావం.. కేరళ హైకోర్ట్ కీలక సూచనలు
ప్రస్తుతం కోజికోడ్ జిల్లోలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కేరళతో సరిహద్దు పంచుకుంటున్న కర్నాటక జిల్లాల నుంచి కూడా ఎవరినీ అనుమతించడంలేదు.
కేరళలో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న దశలో శబరిమల యాత్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేరళ హైకోర్టు సూచించింది. మకర సంక్రాంతి పూజల తర్వాత ప్రతి నెలా ఐదు రోజులపాటు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరచి పూజలు చేయడం ఆనవాయితీ ఈ నెలలో రేపటి నుంచి ఆలయ ద్వారాలు తెరచుకోబోతున్నాయి. 22వ తేదీ వరకు పూజలు జరుగుతాయి. అయితే ఇప్పటికే కేరళలో నిఫా భయం పెరిగిపోయింది. శబరిమలకు వచ్చే భక్తుల విషయంలో కూడా మార్గదర్శకాలు విడుదల చేయాలని కేరళ హైకోర్టు సూచించింది.
శబరిమల యాత్ర విషయంలో మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించింది కేరళ హైకోర్టు. అవసరమైతే దేవస్థానం బోర్డుతో మాట్లాడాలని చెప్పింది. హెల్త్ సెక్రటరీ సలహాలు తీసుకోవాలని చెప్పింది. రేపటి నుంచి 5రోజులపాటు దర్శనాలు ప్రారంభమవుతున్న సందర్భంలో వీలైనంత త్వరగా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరింది.
ప్రస్తుతం కోజికోడ్ జిల్లోలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కేరళతో సరిహద్దు పంచుకుంటున్న కర్నాటక జిల్లాల నుంచి కూడా ఎవరినీ అనుమతించడంలేదు. కోజికోడ్ లోని పలు ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్ లుగా ప్రకటించారు. ఇటు శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లా విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఆంక్షలేవీ లేవు. కోజికోడ్ కి సుదూరంగా పతనంతిట్ట ఉండటంతో ఇక్కడ హడావిడిపడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. ఐదు రోజుల అయ్యప్ప దర్శనం విషయంలో కూడా ప్రస్తుతానికి ఎలాంటి ఆంక్షలు లేవు అని తెలియజేశారు.
♦