సమష్టి కృషితోనే స్వచ్ఛ భారత్‌ సాధ్యం

గాంధీజీ స్వచ్ఛభారత్‌ కలను సాకారం చేస్తామన్న ప్రధాని నరేంద్రమోడీ

Advertisement
Update:2024-10-02 11:58 IST

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ స్కూల్‌ విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సమష్టి కృషితోనే స్వచ్ఛ భారత్‌ సాధ్యమౌతుందన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి పదేళ్లు పూర్తయ్యాయి. స్వచ్ఛభారత్‌ మిషన్‌ అనేది ప్రజల ఉద్యమంగా మారిందన్నారు. గాంధీజీ స్వచ్ఛభారత్‌ కలను సాకారం చేస్తామన్నారు. ప్రధాని పిలుపు మేరకు పలువురు రాజకీయ నేతలు స్వచ్ఛ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజీవ్‌ రంజన్‌, ముఖేశ్‌ మాండవీయతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. సివరేజ్‌ ప్లాంట్ల ద్వారా దేశవ్యాప్తంగా మురుగు శుద్ధి చేస్తామని తెలిపారు. సేవా పక్వాడా కార్యక్రమంలో 28 కోట్ల మంది పాల్గొన్నారని ప్రధాని చెప్పారు.

2014 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ 'స్వచ్ఛ్‌ భారత్‌' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం

అంతకుముందు స్వచ్ఛభారత్‌పై ప్రధాని ట్వీట్‌ చేశార. 'నేను నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాను. మీరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ చొరవ స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది' అని తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News