మా బస్టాప్ పోయింది మీరు చూశారా..?

బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డు దగ్గర మెట్రోపోలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (BNTC) కొత్తగా బస్టాప్‌ను ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్ నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసింది.

Advertisement
Update:2023-10-05 19:45 IST

బస్టాపుల్లో జేబు దొంగలు, చైన్‌ స్నాచర్లు ఉంటారని, వాళ్లు మన దగ్గరున్న విలువైన వస్తువులు కొట్టేస్తారు మ‌న‌కు తెలుసు. కానీ, ఓ ప్రబుద్ధుడు ఏకంగా బస్‌స్టాప్‌కే ఎసరు పెట్టాడు. జనాలు అసలు ఆ ప్లేస్ లో బస్టాప్ ఉండేదా లేకపోతే మనం దారి తప్పామా అనే సందేహం కలిగేలా కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా మొత్తం ఎత్తుకుపోయాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఈ ఘటన జరిగింది.




బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డు దగ్గర మెట్రోపోలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (BNTC) కొత్తగా బస్టాప్‌ను ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్ నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసింది. అయితే షెల్ట‌ర్‌ను అమ‌ర్చిన‌ వారం రోజులకే దొంగతనం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. షెల్టర్ల ఏర్పాటు పనులు అప్పగించిన సంస్థ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై కంపెనీ ప్రతినిధి ఎన్‌. రవి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాఫీ డేకి దగ్గరలో తాము బస్టాప్ నిర్మించామని, ఆగస్టు 21న దాన్ని ప్రారంభించామన్నారు. అయితే ఆగస్టు 28వ తేదీన ఉదయం నాటికి అది మాయమైపోయిందని చెప్పారు. ఘటనపై సెప్టెంబర్‌ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.10 లక్షలు విలువైన ఈ షెల్టర్ చాలా బలమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.


లింగరాజపురం, హెన్నూరు, బాణసవాడి, పులకేశినగర్, గంగేనహళ్లి, హేబల్, యలహంక ప్రాంతాలకు వెళ్లే వందలాది మంది ప్రయాణికులకు ఈ బ‌స్‌స్టాపే దిక్కు. పాత బస్ షెల్టర్ చాలా శిథిలావస్థకు చేరిందని, భారీ వర్షాల సమయంలో ప్రయాణికులకు ప్రమాదం వాటిల్లుతుందని కొద్దిరోజుల క్రితమే దానిని ఈ తీసేసి కొత్త బస్‌షెల్ట‌ర్‌ను ఏర్పాటు చేశారు.

Tags:    
Advertisement

Similar News