కర్నాటక: ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ....కాంగ్రెస్ పార్టీయే అతి పెద్ద పార్టీ
Karnataka Election Exit Polls Results 2023: కర్నాటకలో సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ అయ్యింది. ఓటింగ్ పూర్తయ్యాక ఎంత శాతం పోలింగ్ అవుతుందో స్పష్టత వస్తుంది.ఇక పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. ఇప్పటి వరకు ప్రీపోల్ సర్వేల్లో వచ్చిన ఫలితాల మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది
కర్నాటక లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తయ్యింది. అయితే ఇప్పటి వరకు ఇంకా లైన్లో ఉన్నవారికి మాత్రం ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు. కొన్ని చిన్న చిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ అయ్యింది. ఓటింగ్ పూర్తయ్యాక ఎంత శాతం పోలింగ్ అవుతుందో స్పష్టత వస్తుంది.
ఇక పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. ఇప్పటి వరకు ప్రీపోల్ సర్వేల్లో వచ్చిన ఫలితాల మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది
*పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:
కాంగ్రెస్: 107 నుండి119 సీట్లు
బీజేపీ: 78 నుండి 90 సీట్లు
జేడీఎస్: 23 నుండి 29 సీట్లు
ఇతరులు: 1 నుండి 3 సీట్లు
*రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:
కాంగ్రెస్: 94 నుండి 108 సీట్లు
బీజేపీ: 85 నుండి 100 సీట్లు
జేడీఎస్: 24 నుండి 32 సీట్లు
*జీ మాట్రిస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:
కాంగ్రెస్: 103 నుండి 118 సీట్లు
బీజేపీ: 79 నుండి 94 సీట్లు
జేడీఎస్: 25 నుండి 33 సీట్లు
*జి మార్క్ ఎగ్జిట్ పోల్స్:
కాంగ్రెస్: 103 నుండి 118 సీట్లు
బీజేపీ: 79 నుండి 94 సీట్లు
జేడీఎస్: 23 నుండి 25 సీట్లు
*జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:
కాంగ్రెస్: 91 నుండి 116 సీట్లు
బీజేపీ: 94 నుండి 117 సీట్లు
జేడీఎస్:14 నుండి 24 సీట్లు