జార్ఖండ్‌‌లో జేఎంఎం కూటమి ఘన విజయం

జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించింది.

Advertisement
Update:2024-11-23 17:08 IST

జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం కూటమి భారీ విజయం సాధించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేసింది. ఇండియా కూటమి 51 స్ధానాల్లో విజయం సాధించింది. మరో ఐదు స్థానాల్లో అధిక్యంలో ఉంది. బీజేపీ కూటమి 21 స్థానాల్లో గెలిచింది. మరో 3 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది చూస్తే.. జేఎమ్ఎమ్ 32 స్థానాల్లో గెలుపు సాధించగా.. గత ఎన్నికల్లో కంటే రెండు స్థానాల్లో ఎక్కువ విజయం అందుకుంది.

ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 16 స్థానాల్లో విజయం సాధించగా.. ఇప్పుడు కూడా 16 స్థానాల్లో విజయం సాధించింది.ఇక రాష్ట్రీయ జనతా దళ్ 5 స్థానాల్లో గెలిచింది. కానీ గత ఎన్నికల్లో కంటే 1 స్థానం కోల్పోయింది. కానీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించారు లాలూ నేతృత్వంలోని “రాష్ట్రీయ జనతా దళ్” సభ్యులు. ఇక “ఇండియా” కూటమి లో భాగస్వామ్య పక్షంగా ఉన్న సిపిఐ ఒక్క స్థానంలో విజయం ఖరారు చేసుకుంది.

Tags:    
Advertisement

Similar News