కర్ణాటకలో కురుస్తున్న నగదు, మద్యం, ఉచితాల వర్షం

ధార్వాడ్ జిల్లాలోని ధార్వాడ్ నియోజకవర్గంలో స్టాటిక్ సర్వైలెన్స్ బృందం దాదాపు రూ.45 లక్షల విలువైన 725 గ్రాముల బంగారాన్ని, బెంగళూరు నగరంలోని బైటరాయణపుర నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.34 లక్షలకు పైగా విలువైన ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు EC బులెటిన్‌లో పేర్కొంది.

Advertisement
Update:2023-04-07 07:31 IST

ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి కర్ణాటకలో నగదు, బంగారం, మద్యం, ఉచితాల వర్షం కురుస్తోంది. గురువారం నిప్పాణి, భద్రావతి, గడగ్, నరగుందాల్లో వివిధ పోలీసు బృందాలు రూ.4.45 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం బులెటిన్‌లో వెల్లడించింది.

ఇది కాకుండా దాదాపు రూ.1.89 కోట్ల విలువైన 62,826 లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది.

ధార్వాడ్ జిల్లాలోని ధార్వాడ్ నియోజకవర్గంలో స్టాటిక్ సర్వైలెన్స్ బృందం దాదాపు రూ.45 లక్షల విలువైన 725 గ్రాముల బంగారాన్ని, బెంగళూరు నగరంలోని బైటరాయణపుర నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.34 లక్షలకు పైగా విలువైన ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఇసి  బులెటిన్‌లో పేర్కొంది.

గురువారం బెళగావిలోని ఖానాపూర్ తాలూకాలో రూ.4.61 కోట్ల నగదు, రూ.21.25 లక్షల విలువైన 395 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.27.38 కోట్ల నగదు, రూ.26.38 కోట్ల విలువైన మద్యం, రూ.88 లక్షల విలువైన డ్రగ్స్, రూ.9.87 కోట్ల విలువైన 25.24 కిలోల బంగారం, రూ.12.49 కోట్ల విలువైన ఫ్రీబీలను స్వాధీనం చేసుకున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags:    
Advertisement

Similar News