స్కాలర్‌షిప్‌ల ఆదాయ పరిమితి రూ.8 లక్షలకు పెంచండి

ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

Advertisement
Update:2024-12-10 16:29 IST

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. ఆ లేఖను తన ఎక్స్‌ ఎకౌంట్‌లో స్టాలిన్‌ పోస్ట్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు వారి కుటుంబ వార్షికాదాయం రూ.2.50 లక్షల వరకు ఉండాలనే నిబంధన ఉందని లేఖలో గుర్తు చేశారు ఆ పరిమితిని రూ.8 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద లబ్ధిపొందేందుకు వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలుగా ఉండాలని నిర్దేశించిందని గుర్తు చేశారు. ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌హెచ్‌ఈ) నివేదికలోని గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) ఇతర వర్గాల విద్యార్థులతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, ఇతర బీసీ కులాల విద్యార్థులు వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఆయా వర్గాల ఎన్‌రోల్‌మెంట్‌ శాతం పెంచాలన్నా, ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలన్న స్కాలర్‌షిప్‌ల జారీకి వారి కుటుంబ ఆదాయ పరిమితిని పెంచడమే మార్గమని సూచించారు. తన విజ్ఞప్తిని వీలైనంత త్వరగా పరిష్కరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.



Tags:    
Advertisement

Similar News