పాలస్తీనాకు మద్దతుగా వందలాది మంది విద్యార్థుల ర్యాలీ

యూనివర్సిటీలో క్లాసులు ముగిసిన అనంతరం.. వందలాది మంది విద్యార్థులు కలిసి పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ చేశారు.

Advertisement
Update:2023-10-18 08:59 IST

పాలస్తీనాపై ఇజ్రాయేల్ దాడుల కారణంగా వందలాది మంది అమాయకులు బలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలోని పలువురు ప్రజలు, విద్యార్థులు కూడా తమ మద్దతు ప్రకటిస్తున్నారు. పాలస్తీనాకు మద్దతు ఇస్తే కేసులు పెడతామంటూ బీజేపీ నాయకులు బెదిరిస్తున్నా.. ఎవరూ తగ్గడం లేదు. తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ విద్యార్థులు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేశారు.

బెంగళూరులోని యూనివర్సిటీలో క్లాసులు ముగిసిన అనంతరం.. వందలాది మంది విద్యార్థులు కలిసి పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ చేశారు. ఇజ్రాయేల్ ఆగడాలను ఖండించడమే కాకుండా.. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాకే మా మద్దతు అంటూ నినాదాలు చేసుకుంటూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీని కొనసాగించారు.

ఇటీవల అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్థులు కూడా పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. గత వారం నిర్వహించిన ఈ ర్యాలీలో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ హరనాథ్ సింగ్ యూపీ సీఎం ఆదిత్యానాథ్‌కి లేఖ రాశారు. ఇలాంటి ర్యాలీలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సదరు ఎంపీ లేఖలో పేర్కొన్నారు.


Tags:    
Advertisement

Similar News