హర్యానా బీజేపీకి అదనపు బలం

సావిత్రి జిందాల్‌ సహా ఇండిపెండెంట్ల మద్దతు కమలం పార్టీకే

Advertisement
Update:2024-10-09 17:52 IST

హాట్రిక్‌ విజయంతో హర్యానాలో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీకి అదనపు బలం సమకూరింది. దేశంలోనే సంపన్న మహిళ రాజకీయ నాయకులు సావిత్రి జిందాల్‌ సహా ఆ రాష్ట్రంలో విజయం సాధించిన ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకే మద్దతు ప్రకటించారు. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు దేవేందర్‌ కడ్యాన్‌, రాజేశ్‌ జాన్‌ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సావిత్రి జిందాల్‌ తన మద్దతు బీజేపీకి ప్రకటించడంతో 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 51కి పెరిగింది. ఎన్నికల్లో బీజేపీ నుంచి 48 మంది, కాంగ్రెస్‌ పార్టీ తరపున 37 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సావిత్రి జిందాల్‌ గతంలో కాంగ్రెస్‌ లో కీలక నేతగా పని చేశారు. రాష్ట్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి ఎన్నికల్లో హిస్సార్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా, టికెట్‌ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి విజయం సాధించారు. 

Tags:    
Advertisement

Similar News