సల్మాన్‌ఖాన్‌ పెళ్లెందుకు చేసుకోలేదంటే.. - క్లారిటీ ఇచ్చిన సల్మాన్‌ తండ్రి

సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి విషయమై ఆయన తండ్రి సలీమా ఖాన్‌ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో సలీమా ఖాన్‌ మాట్లాడుతూ.. సల్మాన్‌ ఎవరినైనా త్వరగా ఇష్టపడతాడని చెప్పారు.

Advertisement
Update: 2024-06-25 03:21 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే విషయం ఆయన పెళ్లెప్పుడు చేసుకుంటాడా అని. ఇప్పటికే 58 ఏళ్ల వయసుకు వచ్చేసిన ఈ హీరో పెళ్లి విషయంలో పెద్దగా ఆసక్తి చూపుతున్నట్టు కనిపించడు. కానీ, గతంలో ఓ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పెళ్లి, లవ్‌ బ్రేకప్‌ల గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. తన జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు వివాహం చేసుకుంటానని ఆయన తెలిపారు. తన మాజీ గర్ల్‌ ఫ్రెండ్స్‌ అందరూ మంచివారేనని, వాళ్లవైపు నుంచి ఎలాంటి తప్పూ లేదని చెప్పారు. తాను వాళ్లను సరిగ్గా చూసుకోలేనేమో అనే భయంతోనే బ్రేకప్‌ చెప్పి ఉండొచ్చని తెలిపారు. వాళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. తన ప్రేమకథలన్నీ తనతోపాటే సమాధి అవుతాయని ఆయన తెలిపారు.

ఇక సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి విషయమై ఆయన తండ్రి సలీమా ఖాన్‌ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో సలీమా ఖాన్‌ మాట్లాడుతూ.. సల్మాన్‌ ఎవరినైనా త్వరగా ఇష్టపడతాడని చెప్పారు. కానీ, అతడికి వివాహం చేసుకొనే ధైర్యం లేదని ఆయన తెలిపారు. సింపుల్‌గా ఉంటాడు కాబట్టి చాలామందికి నచ్చుతాడని, తన జీవితంలోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా.. లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడని వివరించారు. తన తల్లిలాంటి లక్షణాలున్న అమ్మాయిని వెతుకుతుంటాడని చెప్పారు.

అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తన తల్లిలాగే భర్త, పిల్లలకే అంకితం కావాలని కోరుకుంటాడన్నారు. వంట పని, ఇంటి పనులు చేయాలని.. కుటుంబసభ్యులకు అన్ని విషయాల్లో సాయం చేయాలని అనుకుంటాడని చెప్పారు. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం సులభం కాదని ఆయన తెలిపారు. అందుకే సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదని ఆయన ఆ వీడియోలో వివరించారు.

Tags:    
Advertisement

Similar News