ఫెంగల్ తుపాను ఎఫెక్ట్... చెన్నై ఎయిర్‌పోర్ట్ మూసివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను కారణంగా ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Advertisement
Update:2024-11-30 20:06 IST

నెరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను కారణంగా చెన్నై, తిరుపతి నగరాల్లో విమానాల రాకపోకలకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల నుంచి పలు విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దు చేశారు. అదే సమయంలో, తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏడు విమానాలు కూడా రద్దయ్యాయి.

అటు, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలు రద్దయ్యాయి. ముంబయి, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులు కూడా ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయాయి. ఫెంగల్ తుపాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఈ నేపధ్యంలో డిసెంబర్ 1వ తేదీ తెల్లవారుజాము 4 గంటల వరుకు చెన్నై ఎయిర్‌పోర్ట్ కార్యక్రలాపాలు నిలిపివేయనున్నాట్లు విమానశ్రయ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Tags:    
Advertisement

Similar News