పర్వేష్ వర్మకే ఢిల్లీ సీఎం పీఠం!?
కేంద్ర హోం అమిత్ షాతో భేటీ అయిన వర్మ
ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందువరసలో ఉన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ను 3 వేలకు పైగా ఓట్లతో ఓడించిన పర్వేష్ ఆ తర్వాత కాసేపటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు ఢిల్లీ సీఎంగా అవకాశం ఇవ్వాలని పర్వేష్ కోరినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది అధికారం దక్కించుకుంది. ఢిల్లీ సీఎం రేసులో ఉన్న మరో అగ్రనేత రమేశ్ బిధూరి కల్కాజీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ సీఎం అతిశీ చేతిలో పరాజయం పాలయ్యారు. బీజేపీకి వర్మ లాయల్ కావడం, మాజీ సీఎం కొడుకు సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. అయితే బీజేపీ హైకమాండ్ మదిలో ఎవరున్నారు.. అందరూ అనుకున్నట్టు పర్వేష్ వర్మకే పట్టం కడతారా? మరో నేతను ఢిల్లీ గద్దెపై కూర్చోబెడతారా అనేది రెండు, మూడు రోజుల్లో తేలనుంది.