ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ కోచింగ్‌ సెంటర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2024-08-05 16:13 IST

ఢిల్లీలో యూపీఎస్‌సీ కోచింగ్‌ సెంటర్‌లో జరిగిన దుర్ఘటనలో శిక్షణ పొందుతున్న ముగ్గురు అభ్యర్థులు వరద నీటిలో మునిగి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్‌ ప్రవేశ పరీక్షకు విద్యార్థులను ప్రిపేర్‌ చేసేందుకు విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్న వందల సంఖ్యలో ఉన్న కోచింగ్‌ సెంటర్‌లకు ఎలాంటి నిబంధనలు విధించారో చెప్పాలని కోర్టు కోరింది.

ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ కోచింగ్‌ సెంటర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోచింగ్‌ సెంటర్లు మృత్యు కుహరాలుగా మారాయని మండిపడ్డారు. అవి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఎన్సీఆర్‌ను ధర్మాసనం వివరణ కోరింది.

Tags:    
Advertisement

Similar News