అవి పాత వీడియోలు..ప్రజ్వల్‌ను వెనకేసుకొచ్చిన తండ్రి రేవణ్ణ
కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సెక్స్ స్కాండల్‌పై..ప్రజ్వల్‌ను వెనకేసుకొచ్చారు ఆయన తండ్రి H.D.రేవణ్ణ.
కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సెక్స్ స్కాండల్‌పై..ప్రజ్వల్‌ను వెనకేసుకొచ్చారు ఆయన తండ్రి H.D.రేవణ్ణ. 4-5 ఏళ్ల క్రితం పాత వీడియోలను చూపించి కుట్ర చేస్తున్నారంటూ రేవణ్ణ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.
కర్ణాటక రాజకీయాల్లో జరుగుతున్న కుట్ర తనకు తెలుసన్నారు H.D.రేవణ్ణ. ఐతే తాను అలాంటి వాటికి భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయాన్ని JDS హైకమాండ్‌కు వదిలేస్తున్నట్లు చెప్పారు. ఇక తనపై కూడా FIR నమోదు కావడం పట్ల స్పందించారు రేవణ్ణ. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని..వారు ఏదైనా చేయగలరని కామెంట్ చేశారు. 40 ఏళ్లుగా దేవేగౌడ ఫ్యామిలీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందన్నారు. చట్ట ప్రకారం ఏ శిక్షవేసినా సిద్ధమేనన్నారు.
సోమవారం ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి HD రేవణ్ణపై మరో FIR నమోదైంది. తండ్రి,కొడుకులిద్దరూ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భార్య ఇంట్లో లేనప్పుడు రేవణ్ణ తనను అసభ్యంగా తాకరని ఫిర్యాదులో పేర్కొంది. ఇక ప్రజ్వల్ వీడియోకాల్స్‌లో తన కూతురుతో తప్పుగా ప్రవర్తించారని బాధితురాలు స్పష్టం చేసింది. వరుస కాల్స్‌తో ఇబ్బంది పెట్టడంతో ప్రజ్వల్ నెంబర్‌ను తన కూతురును బ్లాక్ చేసిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఇప్పటికే ప్రజ్వల్‌కు చెందిన అనేక వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండగా..తాజాగా నమోదైన FIR..ఆయనను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ..ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరోసారి హసన్ స్థానం నుంచి బరిలో దిగారు. శుక్రవారం లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ప్రజ్వల్ రేవణ్ణ శనివారం జర్మనీకి వెళ్లిపోయారు.