జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెర
జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. గత నెలలో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 41కి చేరింది.
జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ సర్కార్ విశ్వాస పరీక్ష నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 మంది ఓటేయగా, వ్యతిరేకంగా 29 మంది ఓటేశారు. హేమంత్ సోరెన్ అరెస్టు అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో చంపయ్ సోరెన్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష చేపట్టగా, చంపయ్ సోరెన్ ప్రభుత్వం అందులో నెగ్గింది.
జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. గత నెలలో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 41కి చేరింది. విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 29 మంది ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో చంపయ్ సోరెన్ ప్రభుత్వం విజయం సాధించింది. ఉత్కంఠకు తెరపడింది.