బీజేపీ కుక్క లాంటిది.. మహారాష్ట్ర నేత నానా పటోలే షాకింగ్ కామెంట్స్

మహారాష్ట్ర రాజకీయాల్లో కుక్క వివాదం రచ్చ లేపుతుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మరో కాంట్రవర్సీకి తెరలేపుతూ బీజేపీని కుక్కతో పోల్చారు.

Advertisement
Update:2024-11-12 15:36 IST

మహారాష్ట్ర రాజకీయాల్లో కుక్క వివాదం రచ్చ లేపుతుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మరో కాంట్రవర్సీకి తెరలేపుతూ బీజేపీని కుక్కతో పోల్చారు. అకోలాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనను తాను దేవుడిగా భ్రమపడుతున్నారని విమర్శించారు. ఓబీసీ కమ్యూనిటీపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదన్న ఆయన.. ‘‘మిమ్మల్ని కుక్కలు అంటున్న బీజేపీకి అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా?’’ అని ప్రశ్నించారు.

బీజేపీని ఇప్పుడు కుక్కలా మార్చే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి బీజేపీని పారదోలే సమయం ఆసన్నమైందన్న నానా పటోలే.. పలు అబద్ధాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు దాని స్థానమేంటో చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. బీజేపీ నేతలు తమను తాము దేవుడిగా, విశ్వగురుగా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫడ్నవీస్ కూడా తనకు తాను దేవుడినని అనుకుంటున్నారని విమర్శించారు. నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరిట్ సోమయ తీవ్రంగా స్పందించారు. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అంటరానివాడిలా గది బయటే ఉంచిన పార్టీ నుంచి ఇంకేం అశించగలమని దుష్యంత్ విమర్మించారు.

Tags:    
Advertisement

Similar News