ఏపీ బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. ఉప ఎన్నికకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించారు.
Advertisement
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ రోజు విడుదల చేసింది. అందులో ఏపీ నుంచి మాజీ రాజ్య సభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను కేంద్రం ప్రకటించింది. కాగా గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజేర్వేషన్లు, స్కాలర్ షిప్‌లపై ఆయన ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆయనకు తిరిగి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది.
Advertisement