వైష్ణోదేవీ ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం..పిస్టోల్‌తో ఆలయంలోకి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. ఆమెను ఢిల్లీ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న జ్యోతిగుప్తాగా గుర్తింపు;
Advertisement
జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత ఆధ్మాత్మిక ప్రదేశం శ్రీ మాతా వైష్ణోదేవీ ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నది. ఓ మహిళ భద్రతా తనిఖీలను దాటుకొని.. పిస్టోల్‌తో ఆలయంలోకి ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 15న ఓ మహిళ పిస్టోలుతో వైష్ణోదేవి ఆలయంలోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన ఆలయ అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఢిల్లీ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న జ్యోతిగుప్తాగా గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్డ్స్ గన్ ఆలయంలోకి తీసుకొచ్చినందుకు గాను ఆ మహిళపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆమె దేవాలయంలోపలికి ప్రవేశించే వరకు భద్రతా సిబ్బంది ఎవరూ దానిని గుర్తించకపోవడంపై భక్తులు విమర్శిస్తున్నారు.
Advertisement