మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెకు పిలుపు
మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు వివిధ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.;
Advertisement
లేబర్ కోడ్ రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ పలు కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కనీస వేతనం రూ.26వేలు, ఈపీఎస్ కింద రూ.9వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ మేరకు మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. అప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో కార్మికుల సమస్యలపై అవగాహన కల్పించనున్నాయి.
డిమాండ్లు నెరవేర్చకపోతే ఆ రోజు భారత్ బంద్ పాటించనున్నాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఏ పథకం కిందకు రానివారికి నెలకు రూ. 6,000 ఇవ్వాలని కూడా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రెండు నెలల తర్వాత నిర్వహించే సమ్మె, భవిష్యత్తులో కార్మికులు, రైతుల దేశవ్యాప్త నిర్ణయాత్మక పోరాటాలకు నాంది పలుకుతుందని కార్మిక సంఘాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
Advertisement