అత్యంత కాలుష్య నగరంగా మరోసారి ఢిల్లీ

దేశ రాజధాని న్యూఢిల్లీ మరోసారి అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.;

Advertisement
Update:2025-03-18 22:18 IST

అధిక కాలుష్య నగరాల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ మరోసారి అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా ఉన్నాయి. 2024-25 శీతాకాలంలో ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే, ఢిల్లీలో గాలి నాణ్యత గత ఏడాదితో పోలిస్తే మాత్రం మెరుగ్గా ఉంది. గత ఏడాది ఇదే శీతకాలం సమయంలో పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 189 మైక్రోగ్రాములుగా రికార్డయింది.

ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా దేశంలో రెండో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో పీఎం 2.5 సగటు స్థాయి క్యూబిక్ మీటర్‌కు 65 మైక్రోగ్రాములుగా నమోదైంది.హైదరాబాద్‌లో అలాగే ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్‌లో పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 52 మైక్రోగ్రాములు, ముంబైలో 50, బెంగళూరులో 37, లో 36 మైక్రోగ్రాములు ఉన్నట్లుగా నివేదిక తెలిపింది.

Tags:    
Advertisement

Similar News