ఈ దోపిడీ ఎంతకాలం కానసాగుతుంది ?

ముడి చమురు ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గడం లేదని ధ్వజమెత్తిన ఖర్గే;

Advertisement
Update:2025-03-17 18:04 IST

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్‌ అయ్యారు. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ... దాని ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడి చమురు ధరలు 42 నెలల కనిష్ఠస్థాయికి చేరుకున్నాయని పలు మీడియా సంస్థలు వెల్లడించిన నివేదికలను ఉటంకించారు. బీజేపీ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతూ, వారిని దోచుకుంటుందని ప్రశ్నించారు.

ముడి చమురు ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గడం లేదని ధ్వజమెత్తిన ఖర్గే. మే 2014 నుంచి సుమారు 34 శాతం తగ్గాయి. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 36 లక్షల కోట్ల పన్ను వసూలు చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంకా ఈ దోపిడీ ఎంతకాలం కానసాగుతుంది అని ఖర్గే సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ త్వరలో అమల్లోకి తేనున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపైనా మాట్లాడుతూ.. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. దేశ వనరులు, పాలనలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం ఉండాలని పేర్కొన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వభజన చేయడం వల్ల దక్షిణాదిలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నది. కానీ ఉత్తరాదిలో వాటి సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల దేశంలో సమన్యాయం లేకుండా పోతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా సమాజిక సమానత్వం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఖర్గే పిలుపునిచ్చారు. 

Tags:    
Advertisement

Similar News