వెల్‌కమ్ బ్యాక్ సునీత
క్రూ9.. మీకు స్వాగతం.. భూమి మిమ్మల్ని మిస్ అయిందని ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్;
Advertisement
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చిన సునీత విలయమ్స్ బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. 'క్రూ9.. మీకు స్వాగతం.. భూమి మిమ్మల్ని మిస్ అయింది. మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. అయినా మీ పట్టుదల ఏమిటో అందరికీ చూపించారు. క్లిష్టమైన, అనిశ్చిత పురిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. లక్షలమందిలో స్ఫూర్తి నింపారు. సునీతా విలియమ్స్ ఒక మార్గదర్శకురాలు. మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం అని మోడీ పేర్కొన్నారు.
Advertisement