ఢిల్లీలో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్ర - పాల్గొన్న సోనియా, ప్రియాంకా గాంధీలు
యాత్ర ఢిల్లీలో 23 కిలోమీటర్ల మేర సాగుతుంది, బదర్పూర్ సరిహద్దు నుండి ప్రారంభమై ఎర్రకోట వద్ద ముగుస్తుంది. ఇది నిజాముద్దీన్, ఇండియా గేట్, ITO, ఢిల్లీ గేట్, దర్యాగంజ్ మీదుగా వెళుతుంది. ఢిల్లీలో ఒక రోజు యాత్ర సాగిన తర్వాత 9 రోజుల పాటు యాత్రకు విరామమిచ్చి తిరిగి జనవరి3 వ తేదీన యాత్రను మొదలుపెడతారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర శనివారం హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. బదర్పూర్ వద్ద రాహుల్ కు ఘన స్వాగతం లభించింది.
ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ, " యాత్ర ఉద్దేశం నిజమైన హిందుస్థాన్ ను ప్రదర్శించడమే, ఇక్కడ ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, RSS , BJP లా ద్వేషంతో నిండి ఉండకుండా యాత్రలో లక్షల మంది పాల్గొన్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు'' అని అన్నారు. "ద్వేషపూరిత మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరవడానికి" తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఢిల్లీలో యాత్రలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, జైరాం రమేష్, పవన్ ఖేరా కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు.