అస్సాంలో భారీ వరదలు , 25 మంది మృతి

అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు పొంగిపొర్లుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు బురదగా మారాయి. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు.

Advertisement
Update: 2024-06-19 12:53 GMT

అస్సాంని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటి వరకూ 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతోంది. సుమారు 15 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది.

అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు పొంగిపొర్లుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు బురదగా మారాయి. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. నివాస గృహాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. మంగళవారం రాత్రి కరీంగంజ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

 

మొత్తం 470 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద తాకిడికి సుమారు 1380 హెక్టార్ల పంట నష్టపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సహయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 5 వేల పైగా పౌరులు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా గ్రామాలలో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

 

రాష్ట్రంలో బిస్వనాథ్, హోజాయ్, బొంగైగావ్, నల్బరీ, తముల్‌పూర్, ఉదల్‌గురి, దర్రాంగ్, ధేమాజీ, హైలాకండి, కరీంగంజ్‌, గోల్‌పరా, నాగావ్, చిరాంగ్, కోక్రాఝర్ జిల్లాలు వరద ప్రభావానికి లోనేయాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News