పతీకి తోడు..పార్టీకి అండ ఝార్ఖండ్‌లో గెలుపు వెనుక ఆమె పాత్ర
ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం కూటమి కూటమి గెలుపు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్న జేఎంఎం మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంది.
ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం కూటమి కూటమి గెలుపు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్న జేఎంఎం మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కౌంటింగ్ ఆరంభం నుంచే జేఎంఎం జోరును కొనసాగిస్తోంది. ఈసారైన అధికారాన్ని దక్కించుకోవాలనుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఈ ఎన్నికల్లో నిరాశ తప్పేలా లేదు.అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్న జేఎంఎం మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కౌంటింగ్ ఆరంభం నుంచే జేఎంఎం జోరును కొనసాగిస్తోంది. ఈసారైన అధికారాన్ని దక్కించుకోవాలనుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఈ ఎన్నికల్లో నిరాశ తప్పేలా లేదు. జేఎంఎం కూటమి అభివృద్ధి కూటమికి ప్రజలు తిరిగి పట్టం కట్టారని కల్పనా సోరెన్ ఓ వైపు ఫలితాలు వెలువడుతుండగా స్పందించారు. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా జేఎంఎం-కాంగ్రెస్ కూటమిపై విజయం సాధించాలనే బీజేపీ ఆశలకు గండిపడింది. జేఎంఎం సారథ్యంలోని 'ఇండియా' కూటమికి సంపూర్ణ ఆధిక్యం కట్టబెట్టే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి.
దీంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ వరుసగా రెండోసారి జార్ఖాండ్ సీఎంగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. జేఎంఎం కూటమి విజయం వెనుక కల్పనా సోరెన్ పాత్ర కీలకం ఉందని చెప్పుకోవచ్చు. భర్త హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఆమె పార్టీ బాధ్యతలను తీసుకుంది. 39 ఏళ్లకే ఎంతో రాజకీయ పరిణతితో వ్యవహరించారు. గాండేయ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి శాసన సభల్లోకి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హేమంత్ జైలు నుంచి వచ్చాక ఆయనతో కలిసి దాదాపు 200 మీటింగ్‌ల్లో పాల్లోన్నారు. జేఎంఎం పార్టీకి అండగా నిలిచి విజయంలో ముఖ్య పాత్ర వహించింది. అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెఎస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎన్డీయేలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ , జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఉన్నాయి.