కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ముందు హైడ్రామా
Advertisement
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నాయకుల ఇండ్లకు ఏసీబీ అధికారులు వెళ్లారు. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కొక్కరికి రూ.1.50 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ఏసీబీ రంగంలోకి దిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహించాల్సి ఉంది. ఈలోగానే ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. సంజయ్ సింగ్ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడంతోనే ఏసీబీ రంగంలోకి దిగిందని అధికారులు చెప్తున్నారు.
Advertisement