ఢిల్లీలో ఆప్ ఓటమి..స్వాతి మాలీవాల్ ‘ద్రౌపది’ పోస్టు వైరల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ పార్టీ ఓటమి నేపధ్యంలో రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ట్వీట్ వైరలవుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీపై రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తీవ్ర విమర్శలు చేశారు. స్త్రీలకు మహిళలకు హాని తలపెట్టిన వారిని భగవంతుడు శిక్షిస్తాడని పేర్కొన్నాది. ఈ నేపథ్యంలో ఆమె ‘ఎక్స్ వేదికగా కౌరవ మహాసభలో ‘ద్రౌపది వస్త్రాపహరణం’కు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. స్వాతి మాలీవాల్ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మనం చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఏ మహిళకైనా ఏదైనా అన్యాయం జరిగితే దేవుడు అందుకు బాధ్యులైన వారిని తప్పక శిక్షిస్తాడు.’ అని స్వాతి మాలివాల్ ఆప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్‌పై కూడా స్వాతి మాలివాల్ విమర్శనాస్త్రాలు సంధించారు.
‘రావణుడి గర్వం అణిగింది. ఇప్పుడాయన కేవలం కేజ్రీవాల్ మాత్రమే.’ అని తీవ్ర వ్యాఖ్య చేశారు. అహం, గర్వం ఎక్కువ కాలం పనిచేయవని అన్నారు. జల, వాయు కాలుష్యాలతో ప్రస్తుతం ఢిల్లీ పూర్తిగా చెత్తకుండిలా మారిపోయిందని, అభివృద్ధిలో వైఫల్యం ద్వారా కేజ్రీవాల్ తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నాడని స్వాతి మాలివాల్ ఆరోపించింది. ఆప్ సర్కారు మాటలు చెప్పడమే తప్ప చేతలు చేయకపోవడంతో ప్రజలు ఓడించారని అన్నారు. ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, పలుమార్లు కొట్టాడని ఆమె ఆరోపించారు. నాడు ఈ సంఘటన దిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.