నేడు తిరుమలకు ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్
రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు చేరుకుంటారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ కొంతకాలం క్రితం బెయిల్ పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేజ్రీవాల్ చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ ఇచ్చినా అనేక ఆంక్షలు పెట్టడంతో ప్రజల వద్దకు వెళ్లే నిర్దోశిత్వాన్ని నిరూపించుకుంటానని సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ సీనియర్ నేత అతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి దర్శనం తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు.