గాజాపై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 130 మందికిపైగా మృతి
జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత చోటుచేసుకున్న అతి పెద్ద దాడి ఘటన;
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 130 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత చోటుచేసుకున్న అతి పెద్ద దాడి ఘటన ఇదేనని పేర్కొంటున్నారు.
అమెరికాకు సమాచారం ఇచ్చి గాజాలో ఇజ్రాయెల్ భీకర వైమాని దాడులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని హమాస్ సీనియర్ అధికారి ఆరోపించారు. బందీలను విడుదల చేయకపోతే నరకం చూస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను హెచ్చరించిన విషయం విదితమే. ఆయన చెప్పిన విధంగానే ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికాను కూడా భయభ్రాంతులకు గురిచేసే వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదని వైట్ హౌస్ అధికార ప్రతినిధి తాజాగా వ్యాఖ్యానించారు.