10 వేల మంది ఎందుకు.. 300 మందితో పని చేయండి
యూఎస్‌ఎయిడ్ కు తేల్చిచెప్పిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఇంటర్నేషనల్ డెవపల్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) సంస్థలో పది వేల మంది ఉద్యోగులు ఎందుకని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. అతి తక్కువ మందితో.. అంటే 300ల కన్నా తక్కువ మందితోనే సంస్థ కార్యకలాపాలు సాగించాలని తేల్చిచెప్పారు. అధ్యక్షుడి ఆదేశాలతో సంస్థలో పని చేస్తున్న 9,700 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు యూఎస్‌ఏఐడీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కేవలం 294 మందితోనే సంస్థను పని చేయించేలా ప్రపోజల్స్ సిద్ధమవుతున్నాయని ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. యూఎస్‌ఏఐడీని ఉగ్రవాద భావజాలం ఉన్న ఉన్మాదులు నడిపిస్తున్నారని.. వాళ్లందరినీ వెళ్లగొట్టాల్సిందేనని ట్రంప్ ఇటీవల తేల్చిచెప్పారు. 120 దేశాల అభివృద్ధి, రక్షణకు యూఎస్ ఎయిడ్ నిధులు సమకూర్చుతోంది. మంచి ఉద్దేశంతో నెలకొల్పిన ఈ సంస్థ దారితప్పిందనే అభిప్రాయంతో ట్రంప్ ఉన్నారు. ఈక్రమంలోనే సంస్థ సేవలను పరిమితం చేయడంతో పాటు ఉద్యోగులను వెనక్కి పంపేయాలని ఆదేశించారు.