తొమ్మిదోసారి సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరోసారి ‘స్పేస్‌వాక్’ నిర్వహించారు
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరోసారి 'స్పేస్‌వాక్' నిర్వహించారు. ఎనిమిది నెలల తర్వాత రెండోసారి ఆమె కేంద్రం వెలుపలకు వచ్చారు. మరో వ్యోమగామి విల్మార్, సునీతా శూన్యంలో వాక్ చేశారు. ప్రస్తుతం స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. నాసాకు చెందిన మరో వ్యోమగామితో కలిసి ఐఎస్‌ఎస్‌గా సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేపట్టడానికి బయటకు వచ్చారు. ఆమె ఇటీవలే చేసిన 8వ స్పేస్‌వాక్‌లో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రస్తుత కమాండర్ సునీతా విలియమ్స్ తన తోటి ఆస్ట్రోనాట్, ఫ్లైట్ ఇంజనీర్ బారీ విల్మోర్తో కలిసి మరోసారి ISS నుంచి వెలుపలికి రానున్నారు.
ఇది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా చేపట్టిన 92వ స్పేస్‌వాక్.సునీత విలియమ్స్, విల్మోర్లు ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో ‘ఐఎస్ఎస్’కు వెళ్లిన సంగతి తెలిసిందే. అదే నెల 14న వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. నాసా కు చెందిన మరో వ్యోమగామితో కలిసి ఐఎస్ఎస్కు సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. 2012లో ఆమె చివరిసారి స్పేస్‌వాక్ నిర్వహించగా.. ఇటీవల ఆమె ఎనిమిదోసారి వాక్ చేశారు. తాజాగా మరోసారి స్పేస్‌వాక్ చేశారు. సునీతా ప్రస్తుతం మూడో రోదసి యాత్రలో ఉన్నారు. గతంలో 2006, 2012లో ఐఎస్ఎస్కు వెళ్లారు. 2012 నాటికి ఏడు స్పేస్‌వాక్‌లు నిర్వహించి.. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు.