ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆర్ధిక మాంధ్యం...లక్షమంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్

అమెజాన్ సంస్థ లక్షమంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు ఆ సంస్థ సీఈఓ ప్రకటించారు.

Advertisement
Update:2022-08-01 07:46 IST

ప్రపంచంలో రోజు రోజుకూ పెరుగుతున్న ఆర్ధిక‌మాంధ్యం కారణంగా అనేక కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటున్నాయి. లక్షలాదిమందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఈ కామర్స్ ధిగ్గజ సంస్థ అమెజాన్ అదే బాట పట్టింది. లక్షమంది ఉద్యోగులను తొలగించినట్టు ఆ సంస్థ ప్రకటించింది.

అమెజాన్ వార్షిక ఫలితాలను వెల్లడిస్తూ ఆ సంస్థ సీఈఓ బ్రియాన్ ఒల్సావ్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం తమ 15 లక్షల సిబ్బందిలో లక్ష మందిని తీసేశామని సీఈఓ ప్రకటించారు. ప్రధానంగా డిస‍్టిబ్యూషన్‌ నెట్‌ వర్క్, ఫుల్‌ఫిల్‌ మెంట్‌ సెంటర్ ఉద్యోగులే ఎక్కువగా తొలగించినవారిలో ఉన్నారు. తమ నష్టాలను తగ్గించుకోవడానికి ఇదొక్కటే మార్గమని తాము భావిస్తున్నామని సీఈఓ బ్రియాన్ ఒల్సావ్స్కీ చెప్పారు.

గత సంవత్సరం కూడా అమెజాన్ తన ఉద్యోగులను తొలగించింది. గతేడాది అమెజాన్ 27వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది.ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ 14వేల మందిని హయర్‌ చేసుకున్నట్లు సీఈఓ వెల్లడించారు. ఉద్యోగుల విషయంలో సంస్థ పారదర్శకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News