బొమ్మ తుపాకీ అనుకుని అక్కను కాల్చేసిన చిన్నారి

ఆ సమయంలో మూడేళ్ల చిన్నారికి ఒక గన్ కనిపించింది. అది ఫుల్ లోడెడ్ లో ఉంది. అయితే దానిని ఆ చిన్నారి బొమ్మ తుపాకీ అనుకుంది. తన అక్కవైపు గన్ పెట్టి కాల్చింది.

Advertisement
Update:2023-03-14 07:41 IST

నిజమైన తుపాకీని బొమ్మ తుపాకీ అని భావించిన ఓ చిన్నారి దాన్ని పట్టుకొని తన అక్కను షూట్ చేయడంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. హ్యూస్టన్ ప్రాంతంలోని టామ్ బాల్ పార్క్ వే సమీపంలో ఒక కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో ఒక మూడేళ్ల చిన్నారి, నాలుగేళ్ల బాలిక ఉన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆ ఇద్దరు చిన్నారులు ఇంట్లోని బెడ్ రూమ్ లో ఆడుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

ఆ సమయంలో మూడేళ్ల చిన్నారికి ఒక గన్ కనిపించింది. అది ఫుల్ లోడెడ్ లో ఉంది. అయితే దానిని ఆ చిన్నారి బొమ్మ తుపాకీ అనుకుంది. తన అక్కవైపు గన్ పెట్టి కాల్చింది. దీంతో గన్ లోని బుల్లెట్లు నేరుగా నాలుగేళ్ల పాపను తాకాయి. గన్ పేలిన శబ్దానికి ఇంట్లోని వారు వెంటనే బెడ్ రూమ్ వద్ద వచ్చి చూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. దీంతో వెంటనే వారు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ అమ్మాయి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తాజాగా జరిగిన ఈ విషాదకర సంఘటనతో అమెరికాలో గన్ కల్చర్ పై మరోసారి చర్చ జరుగుతోంది. అమెరికాలో సిటిజన్లు ఎంతో తేలిగ్గా గన్ లైసెన్స్ పొందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అమెరికాలో ఒకరిపై మరొకరు కాల్పులు చేసుకోవడం పెరిగిపోయింది. జాతి కోణంలో కూడా కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు. గన్ అందుబాటులో ఉండటంతో చిన్నచిన్న గొడవలకే దాన్ని ఉపయోగిస్తూ కాల్పులు జరుపుకొంటున్నారు. ఇటువంటి ఘటనలపై తరచూ వార్తలు కూడా వింటున్నాం. ఈ గన్ కల్చర్ అమెరికాలో ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News