మూసీ మార్కింగ్ లతో హైడ్రాకు సంబంధం లేదు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ
Advertisement
మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు పేరుతో రివర్ బెడ్, ఎఫ్‌టీఎల్ లో ఉన్న వారిని తరలించే ప్రయత్నాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో స్పందించారు. మూసీకి ఇరువైపులా చేపట్టిన సర్వేకు, ఇండ్ల మార్కింగ్ లతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మూసీ రివర్ బెడ్ లో నివసిస్తున్న వారిని హైడ్రా తరలించడం లేదని, ఎలాంటి మార్కింగ్ కూడా చేయలేదన్నారు. మూసీ నదిలో ఎలాంటి కూల్చివేతలు కూడా చేపట్ట లేదన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ అనేది ప్రత్యేకమైన ప్రాజెక్టు అని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆ పనులు చేస్తోందని వివరణ ఇచ్చారు. హైడ్రా అనేది కూల్చివేతల కోసమే కాదని, చెరువులు, కుంటల పరిరక్షణ కోసమని తెలిపారు.
Advertisement