నూరేళ్లు జీవించేందుకు చిట్కాలు!

నూరేళ్లు బ్రతకాలంటే ఏం చేయాలి.. అనే విషయంపై ఎన్నో ఏళ్లుగా అధ్యయనాలు జరుగుతున్నాయి.

Advertisement
Update:2023-12-09 10:27 IST
నూరేళ్లు జీవించేందుకు చిట్కాలు!
  • whatsapp icon

ఒకప్పుడు మన పూర్వీకులు వందేళ్ల వరకూ జీవించేవాళ్లని చెప్తుంటారు. అయితే ఇప్పటి రోజుల్లో అది దాదాపుగా అసాధ్యం అని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని చిట్కాలతో జీవితకాలాన్ని పెంచుకోవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి.

నూరేళ్లు బ్రతకాలంటే ఏం చేయాలి.. అనే విషయంపై ఎన్నో ఏళ్లుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ జపాన్‌లో మహిళల యావరేజ్ లైఫ్‌స్పాన్ 88 ఏళ్లు , పురుషుల లైఫ్‌స్పాన్ 82 ఏళ్లుగా ఉంది. వృద్ధాప్యంలో వచ్చే కొన్ని కీలకమైన అనారోగ్యాలకు చెక్ పెట్టడం ద్వారా ఎనభై ఎళ్లకు పైబడి జీవిచడం కష్టమేమీ కాదన్నది నిపుణుల అభిప్రాయం. వయసు పైబడిన తర్వాత క్యాన్సర్, గుండె జబ్బులు, ఒత్తిడి వంటివి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే లైఫ్‌స్పాన్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఎక్కువ కాలం జీవించేందుకు ఎలాంటి ఫార్ములాలు ఫాలో అవ్వాలంటే..

పని చేస్తుండాలి

వ‌య‌సు పెరిగేకొద్దీ ఎముక‌లు, కండ‌రాలు, కీళ్లు బల‌హీన‌ప‌డుతుంటాయి. వాటిని పటిష్టంగా ఉంచుకోవాలంటే నిరంతరం కష్టపడి పని చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా శారీరక శ్రమ ఉండాలి. దానికోసం వ్యాయామం చేయొచ్చు. ఇలా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడం వల్ల మలి వయసులో వచ్చే సమస్యలను అధిగమించొచ్చు.

బ్యాలెన్స్ డ్ డైట్

ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించేలా చేయడంలో పోష‌కాహారానిదే కీలక పాత్ర. శ‌రీరం సహజంగా పనిచేసేందుకు కావల్సిన పోష‌కాలు, విటమిన్లు, మినరల్స్ స‌మ‌పాళ్లలో అందిస్తుండాలి. జంక్ ఫుడ్ మానేయాలి.

శరీరంతో కమ్యూనికేషన్

అసౌకర్యం లేదా అనారోగ్యం కలుగుతున్నప్పుడు శ‌రీరం సంకేతాలు పంపుతుంటుంది. వాటిని గ‌మ‌నిస్తుండాలి. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన శ్రద్ధ పెట్టాలి. తరచూ టెస్ట్‌లు చేయించుకోవాలి. డాక్టర్ల సూచనలు క్రమం తప్పకుండా పాటించాలి.

మరింత ఆనందంగా..

వయసు పెరుగుతున్న కొద్ది మెదడు పరిమాణం తగ్గుతుంది. దీంతో జ్ఞాపక శక్తి, ఫోకస్ వంటివి తగ్గొచ్చు. అందుకే మలి వయసులో చాలామంది ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనవుతారు. దీన్ని జయిస్తే లైఫ్‌స్పాన్ తప్పక పెరుగుతుంది.

ఇతరులతో మంచిగా ఉంటూ ప్రేమగా ఉండేవాళ్లకు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది నిపుణులు సూచిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మీతో మీరు గ‌డ‌పడాన్ని అలవాటు చేసుకోవాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. మోటివేషన్ కోల్పోకూడదు. ప్రకృతిలో ఎక్కువసేపు గడపాలి. ఇలాంటి లైఫ్‌స్టైల్ పాటిస్తే ఎక్కువ కాలం జీవించడం సాధ్యమవుతంది.

Tags:    
Advertisement

Similar News