పోసాని బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు 21న

బెయిల్‌ మంజూరు చేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ కోర్టులో ముగిసిన వాదనలు;

Advertisement
Update:2025-03-19 19:09 IST

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్‌ పిటిషన్‌పై సీఐడీ కోర్టులో నేడు విచారణ జరిగింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ కోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం మార్చి 21కి వాయిదా వేసింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్‌ ఫొటోలను మీడియా సమావేశంలో పోసాని ప్రదర్శించారు. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. 

Tags:    
Advertisement

Similar News