మహిళను హతమార్చి.. శరీర భాగాలను వేరు చేసి
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో దారుణం;
Advertisement
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో దారుణం జరిగింది. ఓ మహిళను దుండగులు హతమార్చారు. అనంతరం శరీర భాగాలను వేరు చేసి బెడ్‌షీట్‌లో చుట్టి నేషనల్ హైవే పక్కన పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బెడ్‌షీట్‌లో ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని కశింకోట సీఐ స్వామినాయుడు తెలిపారు. ఘటనాస్థలంలో ఆధారాలను పరిశీలించి క్లూస్ టీమ్ సాయంతో విచారణ చేపడుతామని ఆయన చెప్పారు.
Advertisement