బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఈడీ ఫోకస్ చేసింది.;

Advertisement
Update:2025-03-18 20:30 IST

ఈడీ ఫోకస్ చేసింది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై, యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల సంపాదనపై ఆరా తీసింది. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్, హవాలా రూపంలో వారికి చెల్లింపులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారణకు పిలిచారు.

మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరుకావాలని కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే విచారణకు వాళ్లు కొంత గడువు కోరగా.. అందుకు పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది.  

Tags:    
Advertisement

Similar News