సికింద్రాబాద్ బ్యాంకులో గుండెపోటుతో న్యాయవాది మృతి
సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది వెంకటరమణ మృతి చెందాడు
Advertisement
సికింద్రాబాద్ సివిల్ కోర్టు సీనియర్ న్యాయవాది వెంకటరమణ గుండెపోటుతో మృతి చెందాడు. మారేడ్‌పల్లిలోని ఇండియన్ బ్యాంకులో లాయర్ చలాన్ కట్టేందుకు వచ్చి న్యాయవాది డబ్బులు జమచేస్తూ కుప్పకూలిపోయాడు. తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తుండగా సీనియర్ న్యాయవాది పసునూరి వేణుగోపాలరావు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వరుస గుండెపోటు మరణాలు హైదరాబాద్‌లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
Advertisement