ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 31 మంది మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది
Advertisement
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement