అమ్మది హత్యే.. డ్రాయింగ్‌ గీసి చూపెట్టిన మృతురాలి కూతురు

యూపీలోని ఝాన్సీలో ఓ వివాహిత మృతి కేసులో కీలక మలుపు..

Advertisement
Update:2025-02-18 10:46 IST

యూపీలోని ఝాన్సీలో ఓ వివాహిత మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెది ఆత్మహత్య కాదు.. హత్యేనని మృతురాలి కూతురు ఓ డ్రాయింగ్‌ గీసి చూపించింది. తండ్రి సందీప్‌ బధిలియానే తన తల్లిని హతమార్చినట్లు ఆ నాలుగేళ్ల చిన్నారి ఆరోపించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. ఝాన్సీలోని కొత్వాలి ప్రాంతంలోని సోనాలీ బుధోలియా మృతి చెందింది. ఆత్మహత్య చేసుకొని మరణించిందని ఆమె అత్తమామలు పోలీసులకు తెలిపారు. అయితే మృతురాలి కుమార్తె దర్శిత ఓ డ్రాయింగ్‌ గీసి తండ్రే, తన తల్లిని ఉరివేసి చంపేసినట్లు ఆరోపించింది.'నాన్నే అమ్మపై దాడి చేసి చంపేశాడు. ఆపై.. కావాలంటే నువ్వు చచ్చిపో అన్నారు' అని ఆ చిన్నారి విలేకరులకు వివరించింది. దానికి సంబంధించి డ్రాయింగ్‌ను చూపించింది. గతంలో అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ బెదిరించినట్లు తెలిపింది. అదనపు కట్నం కోసమే తన కుమార్తెను హతమార్చారని సోనాలి తండ్రి ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్వాలి సిటీ పోలీస్‌ అధికారి తెలిపారు. చిన్నారి పేర్కొన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు వివరించారు.

Tags:    
Advertisement

Similar News