పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా? యూట్యూబర్‌పై సుప్రీం ఫైర్‌

ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడుతారా? అంటూ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై మండిపడిన సుప్రీంకోర్టు

Advertisement
Update:2025-02-18 12:36 IST

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ (ఐజీఎల్) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా? ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడుతారా? అంటూ మండిపడింది.అశ్లీలత, అసభ్యతకు పారామీటర్లు ఏమిటని రణ్‌వీర్‌ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

ఐజీఎల్ పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారంపైనా ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతని వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు సైతం అభ్యతరం వ్యక్తం చేశారు. సమయ్‌ రైనా షోలో రణ్‌వీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతనిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిపై ఇటీవల యూట్యూబర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటిని క్లబ్‌ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దానిపైనే తాజాగా విచారణ జరిగింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్‌ పోర్టు సరెండర్‌ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి షోలు చేయవద్దని పేర్కొన్నది. 

Tags:    
Advertisement

Similar News