శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Advertisement
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణంలో ఉన్న అమరాజా బ్యాటరీ కంపెనీలో భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. క్షణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడటంతో గమనించిన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అనంతరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పేప్రయత్నం చేస్తున్నారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భవనంలో పని చేస్తున్న 150 మంది కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement