హయత్‌నగర్‌లో వ్యాపారవేత్త దారుణ హత్య
కాశీరావు ను అతని కార్యాలయంలోనే గొంతుకోసి చంపేసిన దుండగులు
Advertisement
హయత్‌నగర్ పరిధిలోని భాగ్యలత కాలనీలో వ్యాపారవేత్త హత్యకు గురయ్యాడు. కాశీరావు (37) అనే వ్యక్తిని అతని కార్యాలయంలోనే గొంతుకోసి దుండగులు చంపేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యకు కారణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement