'అయ్యప్పనుం కోషియం', 'సూరారైపోట్రు'కు అవార్డుల పంట.. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం 'కలర్ ఫోటో'
ఈ ఏడాది జాతీయ అవార్డుల కోసం ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 ఎంట్రీలు, నాన్ ఫీచర్‌ఫిల్మ్‌లో 28 భాషల్లో 148 చిత్రాలు వచ్చినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు.
68వ జాతీయ సినిమా అవార్డులను కాసేపటి క్రితం ప్రకటించారు. 2020 ఏడాదిలో విడుదలైన సినిమాకు సంబంధించిన అవార్డులు కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యం అయినట్లు సభ్యులు చెప్పారు. రెండేళ్ల తర్వాత జాతీయ అవార్డులను శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు. బాలీవుడ్ డైరెక్టర్ విపుల్ షా నేతృత్వంలోని 10 మంది సభ్యుల గల జ్యూరీ ఈ అవార్డులను ఎంపిక చేశారు. అవార్డులను ప్రకటించే ముందు పూర్తి నివేదికను కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్‌కు సమర్పించారు.
జాతీయ ఉత్తమ నటులుగా సూర్య (సూరారైపోట్రు - తెలుగులో ఆకాశం నీ హద్దురా), అజయ్ దేవగణ్ (తానాజీ) సంయుక్తంగా ఎంపికయ్యారు. ఇక ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి (సూరారైపోట్రు) ఎంపికైంది. ఈ ఏడాది జాతీయ అవార్డుల కోసం ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 ఎంట్రీలు, నాన్ ఫీచర్ ఫిల్మ్‌లో 28 భాషల్లో 148 చిత్రాలు వచ్చినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు. అన్ని సినిమాలను చూసి, తగిన నిర్ణయం తీసుకున్నామని. కోవిడ్ కారణంగా ఈ సారి ఎంట్రీలు తక్కువగానే వచ్చినట్లు తెలిపారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును వేరే ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటిస్తామని చెప్పారు.
ఇక తెలుగులో ఈ సారి చాలా అవార్డులు దక్కాయి. 'కలర్ ఫోటో'కు ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. నాట్యం సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫి, ఉత్తమ మేకప్ మాన్ అవార్డులు వరించాయి. ఇక 'అల వైకుంఠాపురములో' సినిమాకు గాను థమన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నాడు. మళయాలంలో 'అయ్యప్పనుం కోషియం', తమిళంలో 'సూరారైపోట్రు' అత్యధిక అవార్డులు గెలుచుకున్నాయి.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పూర్తి విజేతల లిస్టు..
ఉత్తమ చిత్రం - సూరారైపోట్రు
ఉత్తమ దర్శకుడు - కేఆర్ సచిదానందన్ (అయ్యప్పనుం కోషియం)
ఉత్తమ పాపులర్ చిత్రం - తానాజీ
ఉత్తమ పిల్లల చిత్రం - సుమి
ఉత్తమ నటులు - సూర్య (సూరారైపొట్రు), అజయ్ దేవగన్ (తానాజీ)
ఉత్తమ నటి - అపర్ణా బాలమురళి (సూరారైపొట్రు)
ఉత్తమ బాల నటులు - అనిశ్ మంగేష్ గోసావి (టక్ టక్), ఆకాంక్ష పింగ్లే, దివ్యేష్ ఇందుల్కర్ (సుమి)
ఉత్తమ సహాయ నటుడు - బీజూ మీనన్ (అయ్యప్పనుం కోషియం)
ఉత్తమ సహాయ నటి - లక్ష్మీ ప్రియ చంద్రమౌళి ( శివరంజినియుం ఇన్నుమ్ సిల పెంగళూమ్)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్ఎస్ థమన్ (అల వైకుంఠాపురములో)
ఉత్తమ నేపథ్య గాయకులు - రాహుల్ దేశ్‌పాండే (మి వసంతరావు), అనిశ్ మంగేశ్ గోసావి (టక్ టక్)
ఉత్తమ నేపథ్య గాయకురాలు - నాంచమ్మ (అయ్యప్పనుం కోషియం)
ఉత్తమ గీతాలు - సైనా
ఉత్తమ ఆడియోగ్రఫి - డోళ్లు
ఉత్తమ కొరియోగ్రఫి - నాట్యం
ఉత్తమ సినిమాటోగ్రఫీ - అవిజాత్రిక్
ఉత్తమ ఎడిటింగ్ - శివరంజినియుం ఇన్నుమ్ సిల పెంగళూమ్
ఉత్తమ కాస్ట్యూమ్స్ - తానాజీ
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - కప్పేలా
ఉత్తమ మేకప్ - నాట్యం
ఉత్తమ స్క్రీన్ ప్లే - సూరారైపోట్రు
ఉత్తమ స్టంట్స్ - అయ్యప్పనుం కోషియం
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
స్పెషల్ మెన్షన్ - ఐమీ బరువా, కావ్యా ప్రకాశ్, సిద్దార్థ్ మీనన్, కిషోర్ కదమ్, వరుణ్ బుద్దదేవ్
ఉత్తమ అస్సామీ చిత్రం - బ్రిడ్జ్
ఉత్తమ బెంగాలీ చిత్రం - అవిజాత్రిక్
ఉత్తమ హిందీ చిత్రం - తులసీదాస్ జూనియర్
ఉత్తమ కన్నడ చిత్రం - డోళ్లు
ఉత్తమ మలయాళ చిత్రం - తింకలజాచా నిశ్చయం
ఉత్తమ మరాఠీ చిత్రం - గోష్టా ఏక పైథనిచి
ఉత్తమ తమిళ చిత్రం - శివరంజినియుం ఇన్నుమ్ సిల పెంగళూమ్
ఉత్తమ తెలుగు చిత్రం - కలర్ ఫొటో
ఉత్తమ హర్యాణవీ చిత్రం - దడ లక్ష్మీ
ఉత్తమ దిమిషా చిత్రం - సమ్కోర్
ఉత్తమ తులు చిత్రం - జీతేగీ
నాన్ ఫీచర్ ఫిల్మ్స్..
ఉత్తమ కుటుంబ విలువల చిత్రం - కుంకుమాచరన్
ఉత్తమ దర్శకుడు - బీవీ రమణ (ఓహ్ థట్స్ బహు)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - శబ్దికున్న కాలప్ప, నిఖిల్ ఎస్ ప్రవీణ్
ఉత్తమ ఆడియోగ్రఫి - పెరల్ ఆఫ్ డిసర్ట్ (అజిత్ సింగ్ రాథోడ్)
ఉత్తమ వాయిస్ ఓవర్ - రాస్పొడి ఆఫ్ రెయిన్స్ (మాన్‌సూన్స్ ఆఫ్ కేరళ) - శోభా థారూర్ శ్రీనివాసన్
ఉత్తమ సంగీతం - 1232 కిలోమీటర్స్ - విశాల్ భరద్వాజ్
ఉత్తమ ఎడిటింగ్ - బార్డర్ ల్యాండ్స్ (ఆనంది అథాలే)
ఉత్తమ లోకేషన్ సౌండ్ - జాదూయ్ జంగల్ (సందీప్ భాటీ-ప్రదీప్ లేఖ్వర్)
ఉత్తమ ఎన్విరాన్‌మెంటల్ ప్రిజర్వేషన్ ఫిల్మ్ - తాలేదండా
ఉత్తమ సోషల్ ఇష్యూస్ సినిమా - ఫ్యునరల్
ఉత్తమ సినిమా బుక్ - ది లాంగెస్ట్ కిస్ బై కిశ్వర్ దేశాయ్
మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్