Yatra 2 Movie Trailer Review | యాత్ర 2 ట్రయిలర్ రివ్యూ
Yatra 2 Movie Trailer Review: పొలిటికల్ సినిమాను కూడా హార్ట్ టచింగ్ గా తీయొచ్చు. యాత్ర-2 ట్రయిలర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.
Yatra 2 Movie Trailer Review: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే ఇమేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎదిగిన తీరును యాత్ర-2 చూపిస్తోంది. తాజాగా రిలీజైన ట్రయిలర్ లో ఈ ఎదుగుదలను ఎమోషనల్ గా చూపించారు.
మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక సాధారణ మహిళ వైఎస్ఆర్‌ను కలిసి, తన కుమార్తె వినికిడి లోపం చికిత్స కోసం సహాయం కోరడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. వైఎస్ఆర్ పాత్రలో నటించిన మమ్ముట్టి ఆ అమ్మాయి చేయి పట్టుకోవడంతో ఈ సీక్వెన్స్ ముగుస్తుంది.
తదుపరి సన్నివేశంలో వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన సంఘటనలను చూపించారు. జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ యత్నిస్తున్నట్లు చూపించారు. భవిష్యత్తులో దేశంలో ఏ నాయకుడూ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేయకూడదని జగన్‌కు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే టైమ్ లో కడపోడు శత్రువుకి తలవొంచడు అనే డైలాగ్ ఆకట్టుకుంది.
మరోవైపు జగన్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు పన్నిన కుట్రల్ని కూడా చూపించారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ట్రైలర్‌లో హృద్యంగా చూపించారు. "నేను విన్నాను...నేను ఉన్నాను" అనే ఫేమస్ డైలాగ్ తో ట్రయిలర్ ముగిసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ యువ నటుడు జీవా నటించారు. ఆ పాత్రకు అతను సరిగ్గా సరిపోయాడు. ట్రైలర్ సింపుల్‌గా ఉన్నప్పటికీ ఎఫెక్టివ్‌గా ఉంది.