Toxic Movie: ఎట్టకేలకు సెట్స్ పైకి యష్ సినిమా

Yash's Toxic Movie: రెండేళ్లు గ్యాప్ తర్వాత యష్ మరో సినిమా స్టార్ట్ చేశాడు. టాక్సిక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

Advertisement
Update: 2024-08-08 17:48 GMT

బాక్సాఫీస్ సెన్సేష‌న్ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా బెంగ‌ళూరులో భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ తెర‌కెక్కించ‌నున్నారు.

ఈరోజు జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో సంప్రదాయానికి అనుగుణంగా నటుడు, నిర్మాత యశ్, నిర్మాత వెంకట్ కె.నారాయణ, వారి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా విజయం సాధించాలని దేవుడి ఆశీస్సులు కోరారు. పూజా కార్య‌క్ర‌మాల్లో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌కి అభినందన‌లు తెలిపారు.

కెజియ‌ఫ్ త‌ర్వాత య‌శ్‌ ఎలాంటి సినిమా చేస్తారోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూసిన అభిమానుల నిరీక్ష‌ణ‌కు ఈరోజుతో తెర‌ప‌డింది. అలాగే సినిమా ప్రారంభ‌మైన రోజుని న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం చూసిన 8-8-8ను సూచిస్తుంది. ఇది య‌శ్ పుట్టిన‌రోజును తెలియ‌జేస్తుంది.



Tags:    
Advertisement

Similar News