Weekend Release | ఈ వారాంతం 4 సినిమాలు రిలీజ్

Weekend Release - ఐపీఎల్ ముగిసింది, ఎన్నికల వేడి చల్లారింది. దీంతో సినిమాలు రెడీ అయ్యాయి. వీకెండ్ 4 సినిమాలొస్తున్నాయి.

Advertisement
Update: 2024-06-06 16:37 GMT

ఈ వారాంతం 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో అందర్నీ ఆకర్షిస్తున్న సినిమా మనమే. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాతో పాటు మరో 2 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే ఈ రెండూ ఒకే జానర్ కు చెందిన సినిమాలు కావడం విశేషం. అవే రక్షణ, సత్యభామ సినిమాలు. కెరీర్ లో తొలిసారి లీడ్ రోల్ లోకి మారి కాజల్ చేసిన సినిమా సత్యభామ. ఇందులో ఆమె పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు.

సరిగ్గా సత్యభామ రిలీజైన రోజునే రక్షణ వస్తోంది. ఇది కూడా పోలీస్ సినిమానే. ఇందులో పాయల్ రాజ్ పుత్ పోలీస్ గా నటించింది. ఇలా ఒకేసారి రెండు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు, ఒకే జానర్ లో థియేటర్లలోకి వస్తున్నాయి.

ఈ సినిమాతో పాటు నవదీప్ రీఎంట్రీ మూవీ లవ్ మౌళి కూడా శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా కోసం బాగా కష్టపడిన నవదీప్, ప్రచారం కోసం కూడా అంతే కష్టపడుతున్నాడు. ఈ 4 సినిమాల్లో ఏ మూవీ క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News