Waltair Veerayya: వాల్తేరు వీరయ్య యూత్ కు ఓ కేస్ స్టడీ
Waltair Veerayya is a case study: వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పటి యంగ్ స్టార్స్ కి ఓ కేస్ స్టడీ అంటున్నారు చిరంజీవి.
వాల్తేరు వీరయ్య సక్సెస్ తో చిరంజీవి ఫుల్ జోష్ లోకి వచ్చేశారు. సినిమా హిట్టవ్వడంతో చిరు ఆనందానికి అవధుల్లేవ్. అయితే ఈ సినిమా విజయాన్ని తన ఒక్కరే సొంతం చేసుకోవడం లేదు. ఇది టీమ్ స్పిరిట్ అంటున్నారు. మరీ ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమా యూత్ కు ఓ కేస్ స్టడీ అంటున్నారు.
"ఇది అందమైన స్క్రీన్ ప్లే. యంగ్ స్టర్స్ దీనిని ఒక కేస్ స్టడీలా చూడాలి. బాబీ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకూ సరిగ్గా నిద్రపోలేదు. సినిమాని చాలా ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా తీశాడు. అందుకే నిర్మాతలకు ఎలాంటి భారం లేకుండా సజావుగా సాగింది. ఈ రోజు అందరు దర్శకులు విజయం ఇవ్వడం కంటే నిర్మాత బడ్జెట్ కి సినిమా తీయడం మొదటి సక్సెస్ గా భావించాలి. దర్శకులే నిర్మాతలని బ్రతికించాలి. పక్కా పేపర్ వర్క్ చేయాలి. నిర్మాతలు ఉంటేనే నటీనటులు బావుంటారు."
ఇలా వాల్తేరు వీరయ్య సినిమాపై హ్యాపీగా స్పందిస్తూనే, దర్శకులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని హెచ్చరించారు చిరంజీవి. ఇక రవితేజపై స్పందిస్తూ.. "నా తమ్ముడు రవితేజ లేకపోతే సెకండ్ హాఫ్ లో ఇంత అందం వచ్చేది కాదు. ఇందులో గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వస్తున్నాయని మా డివోపీ విల్సన్ అన్నారు. ఎదురుగా ఉన్నది నా తమ్ముడని చెప్పా. రవితేజ లేకపోతే ఆ ఎమోషన్ వచ్చేది కాదు" అన్నారు.
ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు