Vishwambhara | విశ్వంభర షూటింగ్ అప్డేట్స్
Vishwambhara | చిరంజీవి హీరోగా వస్తోంది విశ్వంభర మూవీ. షూటింగ్ అప్డేట్స్ చెక్ చేద్దాం.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్ తో పాటు, ఓ పాట, యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించారు.
చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, త్రిషతో సహా మొత్తం బృందం కలిశారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలు తీసిన త్రిష, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్ కనిపిస్తున్న మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. రిచ్ ప్రొడక్షన్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రాబోతోంది. విశ్వంభర 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతోంది విశ్వంభర. ఈమధ్య కాలంలో చిరంజీవి ఫాంటసీ సినిమా చేయలేదు. ఆ లోటును భర్తీ చేస్తే రాబోతోంది ఈ చిత్రం. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. మెయిన్ హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా.. సురభి మరో హీరోయిన్ గా నటించనుంది.